Site icon HashtagU Telugu

Abhishek Sharma: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కారును భారత్‌కు తేలేకపోయిన అభిషేక్ శర్మ.. కారణమిదే!

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: ఏసీసీ ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తరఫున బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్ మ్యాచ్ మినహా మిగిలిన 6 మ్యాచ్‌ల్లో అభిషేక్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసింది. దీని కారణంగానే టీమ్ ఇండియా ఎంతో సులభంగా టోర్నమెంట్‌ను సొంతం చేసుకుంది. అత్యంత అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుతో పాటు ఒక కారు కూడా లభించింది. అయితే ఈ కారును అభిషేక్ భారత్‌కు తీసుకురాలేకపోయాడు. దీని వెనుక ఉన్న కారణం ఇప్పుడు స్పష్టమైంది.

అభిషేక్ శర్మ తన కారును భారత్‌కు తీసుకురాలేడు

ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ 7 మ్యాచ్‌లలోని ఏడు ఇన్నింగ్స్‌లలో 44.86 సగటుతో 314 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అభిషేక్ స్ట్రైక్ రేట్ 200గా ఉంది. ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అదనంగా అతను 32 ఫోర్లు, 19 సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో పాటు అతనికి హావల్ హెచ్9 ఎస్‌యూవీ (Haval H9 SUV) కారు లభించింది.

Also Read: Heart Attacks In Women: మహిళల్లో గుండెపోటు.. కారణాలివే అంటున్న నిపుణులు!

అయితే ఆ కారును అతను భారత్‌కు తీసుకురాలేదు. దీనికి గల కారణం ఏమిటంటే ఈ కారులో డ్రైవర్ సీటు ఎడమ వైపున ఉంటుంది. కానీ భారతదేశంలో డ్రైవర్ సీటు కుడి వైపున ఉంటుంది (రైట్ హ్యాండ్ డ్రైవ్). ఈ కారణంగానే అభిషేక్ ఈ కారును భారతదేశంలో నడపలేరు. అందుకే ఆ కారు భారత్‌కు రాలేకపోయింది.

2-3 నెలల తర్వాత కారు దక్కే అవకాశం

హావల్ హెచ్9 ఎస్‌యూవీ (Haval H9 SUV) కారు నవంబర్ నెల కల్లా భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ కారులో డ్రైవర్ సీటు కుడి వైపున ఉంటుంది. అలాంటప్పుడు అభిషేక్ శర్మకు ఆ కారు లభించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా టీమ్ ఇండియా ఏసీసీ ఆసియా కప్ 2025 విజేతగా నిలిచినప్పటికీ ట్రోఫీని కూడా అందుకోలేకపోయింది. ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ట్రోఫీ తీసుకుని వెళ్లిపోయారు. అంతేకాకుండా టీమ్ ఇండియా ఆటగాళ్లకు మెడల్స్ కూడా లభించలేదు. ఇప్పుడు అభిషేక్‌కు ట్రోఫీ, మెడల్‌తో పాటు కారు కూడా దక్కలేదు. అభిషేక్ త్వరలో అక్టోబర్ 29 నుండి ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ ఆడుతూ కనిపించనున్నాడు.

Exit mobile version