Ashwin: టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ (Ashwin) గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత అతను ఐపీఎల్ 2025లో ఆడాడు. కానీ అది అతనికి అంతగా కలిసి రాలేదు. కొద్ది రోజుల క్రితం అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతానని తెలిపాడు. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం.. అశ్విన్ బిగ్ బాష్ లీగ్ (BBL), ILT20 లీగ్‌లలో ఆడనున్నాడు. ఒక విదేశీ లీగ్‌లో అశ్విన్‌ను తొలిసారి చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
ILT20, BBL లీగ్‌లో అశ్విన్!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అశ్విన్ ILT20, బిగ్ బాష్ లీగ్ ఆడవచ్చు. ILT20 వేలం కోసం అతను నమోదు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. అక్టోబర్ 1న వేలం జరగనుంది. త్వరలో BBL ఫ్రాంచైజీతో కూడా అశ్విన్ ఒప్పందం చేసుకోవచ్చని నివేదిక తెలిపింది. ఈ రెండు టోర్నమెంట్లు దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. అందుకే అశ్విన్ ఒక లీగ్ మాత్రమే ఆడతాడని ఊహించారు. కానీ అలా జరగకపోవచ్చు.
Also Read: Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం!
ILT20, BBL ఒకే సమయంలో
అశ్విన్‌ను ILT20 వేలంలో ఎంపిక చేసినా.. BBLలో ఏ జట్టు అయినా అతనిని తీసుకున్నా, రెండు లీగ్‌లలో ఒకేసారి ఆడటం అతనికి కష్టమవుతుంది. ILT20 డిసెంబర్ 2న ప్రారంభమై జనవరి 4, 2026 వరకు జరుగుతుంది. మరోవైపు BBL సెప్టెంబర్ 14, 2025న ప్రారంభమై జనవరి 25, 2025న ఫైనల్ జరుగుతుంది. ఈ లీగ్‌లలో దాదాపు సగం మ్యాచ్‌లు ఒకే సమయంలో జరుగుతాయి. కాబట్టి అశ్విన్‌కి యుఏఈ, ఆస్ట్రేలియా మధ్య ప్రయాణం చేయడం కష్టం. అతను మొదట ILT20 ప్రారంభంలో ఆడి, ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్‌లో చేరనున్నాడు.
టీ20 క్రికెట్‌లో అశ్విన్ ప్రదర్శన
ఆర్. అశ్విన్ టీ20 కెరీర్ చాలా పెద్దది. అతను అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, దేశీయ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌లో భాగమయ్యాడు.
- మ్యాచులు: 333
- బంతులు: 7200
- వికెట్లు: 317
- ఉత్తమ ప్రదర్శన: 4/8
- సగటు (ఎవరేజ్): 26.94
- ఎకానమీ: 7.11
- 4 వికెట్ల హాల్: 4 సార్లు
