Site icon HashtagU Telugu

Fastest Fifty: యువరాజ్ సింగ్ సిక్సుల రికార్డ్ బద్దలు

Fastest Fifty

Fastest Fifty

Fastest Fifty: 2007లో ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక్కో బంతిని ఒక్కో విధంగా స్టాండ్స్ లోకి పంపించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. కెప్టెన్ ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతో యువరాజ్ సింగ్ అసహనానికి గురయ్యాడు. ఇక అంతే ఆరు బంతులకి ఆరు సిక్సులు బాది చరిత్ర సృష్టించాడు.

16 ఏళ్లుగా యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ ఈ ఏడాది రెండు సార్లు బ్రేక్ అయింది. ఏషియన్ గేమ్స్ లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఆరీ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువి రికార్డ్ బద్దలు కొట్టాడు. తాజాగా అషుతోష్ శర్మ 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు.సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో భాగంగా రైల్వేస్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ నమోదైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ 18.1 ఓవర్లలో 119 పరుగులకి చాపచుట్టేసింది. రైల్వేస్ నుంచి బరిలోకి దిగిన అషుతోష్ శర్మ 12 బంతుల్లో ఒక ఫోర్, 8 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉండగా యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Don’t Drink Water : ఈ ఆహారాలు తిన్న వెంటనే మంచినీరు తాగకూడదట.. ఎందుకంటే ?