Arjun Tendulkar: రవి ఘై మనవరాలు, వ్యాపారవేత్త సానియా చందోక్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో (Arjun Tendulkar) నిశ్చితార్థం చేసుకున్నారనే సమాచారం పత్రికలలోనూ, సోషల్ మీడియాలోనూ వెలువడింది. ఈ వార్త తర్వాత చాలామంది నెటిజన్లు సానియా చందోక్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు.
క్రికెట్ గాడ్‌గా పిలవబడే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తర్వాత సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ఒక శుభవార్తను పంచుకుంది. ఆమె ముంబైలో ఒక పైలేట్స్ అకాడమీని ప్రారంభించింది. అర్జున్ నిశ్చితార్థం తర్వాత ఈ అకాడమీ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, సానియా చందోక్ కూడా కనిపించారు. సచిన్, సానియా ఒకే ఫోటోలో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి.
సానియా చందోక్ గురించి కొన్ని వివరాలు
సానియా చందోక్ ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాత రవి ఘై, ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి బ్రాండ్‌ల యజమాని. ఘై కుటుంబానికి గ్రావిస్ గ్రూప్ కూడా ఉంది. సానియా చదువులో కూడా ముందున్నారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె తన కుటుంబ వ్యాపారాలకు భిన్నంగా, సొంతంగా ఒక వ్యాపారాన్ని స్థాపించారు. ఆమె ముంబైలో మిస్టర్ పాజ్ అనే పెట్ సెలూన్, స్పా, స్టోర్‌ను నిర్వహిస్తున్నారు.
Also Read: Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫ్‌క్ట్..పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
అర్జున్ టెండూల్కర్- సానియా చిన్ననాటి స్నేహితులు. సానియా, అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌కు కూడా మంచి స్నేహితురాలు. ఈ నిశ్చితార్థం ద్వారా ముంబైలోని రెండు ప్రముఖ కుటుంబాలు ఇప్పుడు ఒకటిగా మారాయి. అయితే, వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
సోషల్ మీడియాలో సానియా చందోక్
సానియా చందోక్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రైవేట్ ఖాతా ఉంది. ఈ ఖాతాకు 805 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అర్జున్ టెండూల్కర్, సారా టెండూల్కర్బ కూడా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.