Site icon HashtagU Telugu

MI vs PBKS: అర్జున్ టెండూల్కర్ విఫలం.. నిరాశలో సారా

MI vs PBKS

MI vs PBKS

MI vs PBKS: ఐపీఎల్‌ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పంజాబ్ కింగ్స్‌..గత మ్యాచ్ లో ఫర్వాలేదు అనిపించిన అర్జున్ టెండూల్కర్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో తేలిపోయాడు. ధారాళంగా పరుగులు ముట్టజెప్పి విమర్శలపాలయ్యాడు . ఒకే ఓవర్లో 30 కి పైగా పరుగులిచ్చి పంజాబ్ భారీ స్కోరుకు కారణమయ్యాడు. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 భారీ స్కోర్ సాధించింది.

మూడు ఓవర్లు వేసిన అర్జున్‌ 48 పరుగులిచ్చుకొని ఒ‍క్క వికెట్‌ మాత్రమే తీశాడు. అయితే తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్‌ చేసిన అర్జున్‌..మూడో ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటికే కష్టాల్లోకి కూరుకుపోయిన పంజాబ్‌ కింగ్స్‌ ఒక దశలో 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ పంజాబ్ 200 పరుగులు చేసి భారీ టార్గెట్ ఇచ్చింది ముంబై ఇండియన్స్ కి. అర్జున్‌ టెండూల్కర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మ్యాచ్ తలరాతనే మార్చేసింది. ఈ ఓవర్‌లో అర్జున్‌ వైడ్‌, నోబ్‌ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించాడు.

అయితే ఈ మ్యాచ్ లో తన అన్న వికెట్ పడగొట్టినప్పుడు సారా టెండూల్కర్ ఆనందానికి అవధులు లేవు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. సోదరుడిని చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం కనిపించింది. సచిన్ టెండూల్కర్ కూడా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చేరుకున్నాడు. కొడుకు సాధించిన విజయంతో ఆయన కూడా హ్యాపీగా కనిపించారు. అయితే చివర్లో అర్జున్ ప్రదర్శనతో సారా నిరాశకు గురైంది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: IPL 2023 : IPL ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. IPL ఫైనల్ ఎక్కడో తెలుసా??