Site icon HashtagU Telugu

Kohli Son: జూనియర్ కోహ్లీ వచ్చేశాడు… పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

Kohli Son

Kohli Son

Kohli Son: సస్పెన్స్ కు తెరపడింది…వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సీరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. రెండో సంతానంగా పుట్టిన మగ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేసినట్టు కూడా తెలిపాడు. ఈ నెల 15వ తేదీన అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కోహ్లీ తాను చేసిన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ప్రేమ నిండిన మా మనస్సులతో.. అవధులు లేని సంతోషంతో మాకు మగ బిడ్డ జన్మించడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. వామికాకు సోదరుడు వచ్చేశాడు. మా జీవితాల్లో శుభ సందర్భంలో మీ ఆశీస్సులు, అభినందనలు కోరుకుంటున్నాం. అలాగే.. మా ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోహ్లీ , అనుష్క జోడీ ట్వీట్ చేసింది. కోహ్లీ , అనుష్క దంపతులకు 2021లో తొలి సంతానం కలిగింది. తొలి సంతానం వారికి ఆడ బిడ్డ పుట్టగా.. ఆమెకు వామికా అని పేరు పెట్టుకున్నారు. కాగా ఇప్పుడు మగ బిడ్డ పుట్టడంతో కోహ్లీ వారసుడు , జూనియర్ కోహ్లీ వచ్చేశాడంటూ ఫాన్స్ సంబర పడుతున్నారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని బీసీసీఐ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే కోహ్లీ ఎందుకు దూరమయ్యాడనే కచ్చితమైన కారణాన్ని మాత్రం చెప్పలేదు. తర్వాత కోహ్లీ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని డివిలియర్స్‌ ప్రకటించడం, గంటల వ్యవధిలోనే యూటర్న్‌ తీసుకోవడం గందగోళానికి గురి చేసింది. ఇప్పుడు రెండో బిడ్డ జననంతో ఆ వార్తలన్నిటికీ ఫుల్‌స్టాప్‌ పడినట్టయింది.

Also Read: CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ

Exit mobile version