Site icon HashtagU Telugu

Nortje- Sisanda Ruled Out: దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు వరల్డ్ కప్ కు దూరం..!

Nortje- Sisanda Ruled Out

Compressjpeg.online 1280x720 Image (3) 11zon

Nortje- Sisanda Ruled Out: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు గాయపడిన ఆటగాళ్లు ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. గాయాల కారణంగా సౌతాఫ్రికా జట్టు ఇద్దరు కీలక ఆటగాళ్లు (Nortje- Sisanda Ruled Out) వరల్డ్ కప్ టోర్నీకి దూరమవుతున్నారు. ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్కియాను మినహాయించిన తర్వాత, ఇప్పుడు మోకాలి గాయం కారణంగా ప్రపంచ కప్ జట్టుకు దూరంగా ఉన్న సిసంద మగల రూపంలో రెండవ షాక్ తగిలింది.

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎన్రిక్ నోర్కియా వెన్ను సమస్యతో బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతను 5 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్ళాడు. ప్రపంచ కప్‌కు ముందు అతను ఫిట్‌గా ఉంటాడని ఆఫ్రికన్ జట్టు నమ్మకంగా ఉంది. అయితే అతను ఇప్పుడు వెన్ను సమస్య కారణంగా మెగా ఈవెంట్ కి దూరంగా ఉన్నాడు. RevSports ప్రకారం.. మోకాలి గాయం కారణంగా సిసంద మగల కూడా ఈ టోర్నీలో పాల్గొనలేడని సమాచారం.

సిసంద మగల దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఇప్పటివరకు 8 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 25.4 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లను భర్తీ చేసే వారి పేర్లను ప్రకటించడానికి దక్షిణాఫ్రికా జట్టుకు సెప్టెంబర్ 28 వరకు సమయం ఉంది.

Also Read: Mohammed Siraj Emotional: మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ నోట్, ‘మిస్ యు పప్పా’ అంటూ భావోద్వేగం!

అక్టోబర్ 7న శ్రీలంకతో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. అక్టోబర్ 7న ఢిల్లీలో శ్రీలంక జట్టుతో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీనికి ముందు జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని కూడా పొందింది. ఒకటి అక్టోబర్ 29 న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో కాగా, మరొకటి అక్టోబర్ 2న న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.

ODI ప్రపంచ కప్ 2023 కోసం దక్షిణాఫ్రికా జట్టు

టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, కగిసో రబాడా, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో.