Paralympics : భారత్ పారాలింపిక్స్‌లో మరో స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్‌లో 21-14, 18-21, 23-21తో డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన బెతెల్ ఈ సారి కూడా ఫైనల్‌లో చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో భారత షట్లర్ ఆధిపత్యం ప్రదర్శించగా.. రెండో గేమ్ హోరాహొరీగా సాగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఒక దశలో 11-8తో ఆధిక్యంలో నిలిచిన నితేశ్.. తర్వాత కాస్త పట్టు తప్పాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ షట్లర్ వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్లుగా సాగింది. చివరకు నితేశ్ పైచేయి సాధించాడు. మరోవైపు ఎస్‌ఎల్4లో సుహాస్ యతిరాజ్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. టోక్యోలో రజతం గెలిచిన సుహాస్.. ఈ సారి పసిడి కోసం లుకాస్ (ఫ్రాన్స్)తో తలపడబోతున్నాడు. ఫైనల్ ఇవాళ రాత్రి 9.40 గంటలకు ప్రారంభంకానుంది.
Read Also: Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన అవని లేఖరా తర్వాత ఈ దిగ్గజ పారా షట్లర్ భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించాడు. దీంతో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో భారత్ పతకాల సంఖ్య ఇప్పుడు 9కి పెరిగింది. ఇద్దరు ఫైనలిస్టుల మధ్య జరిగిన సుదీర్ఘమైనమ్యాచ్ లో బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌తో జరిగిన మొదటి గేమ్‌ను నితేష్ సునాయాస విజయం సాధించగా, అతని బలమైన డిఫెన్సివ్ ఆట బెథెల్ పొరపాట్లు చేసేలా చేసింది, ఫలితంగా ప్రారంభ గేమ్‌లో భారత పారా షట్లర్ 21-14తో విజయం సాధించింది.
కాగా, గతేడాది చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో రజత పతకం సాధించిన ఎస్‌ఎల్3 కేటగిరీ ఆటగాడు నితేశ్.. పారిస్ పారాలింపిక్స్‌లో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల శిక్షణ పొందిన ఈ ఇంజనీర్ ఒక రైలు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయాడు.
Read Also: Undavalli : జగన్ చేసిన అతి పెద్ద తప్పు అదే : ఉండవల్లి