Asia Cup 2023: ఆసియా కప్ 2023 (Asia Cup 2023) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. కొంతకాలం క్రితం టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈసారి ఆసియా కప్ వన్డే (50 ఓవర్లు) ఫార్మాట్‌లో జరగనుంది. అదే సమయంలో అన్ని మ్యాచ్‌ల సమయాలు కూడా వెల్లడి అయ్యాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్నాయి.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్‌తో సహా మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లకు చోటు దక్కింది. కాగా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీ రెండు దశల్లో జరగనుంది. ఇందులో గ్రూప్ స్టేజ్, సూపర్-4 దశలు ఉంటాయి.
రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా, 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. పాకిస్థాన్‌లోని మ్యాచ్‌లు లాహోర్, ముల్తాన్ నగరాల్లో జరుగుతాయి. ఇక శ్రీలంకలో క్యాండీ, కొలంబోలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. మల్టీ నేషనల్ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. ఈ సమయంలో, పాకిస్తాన్ జట్టు స్వదేశంలో గ్రూప్ దశలో ఒక మ్యాచ్ (మొదటి మ్యాచ్) మాత్రమే ఆడుతుంది. అదే సమయంలో సెప్టెంబర్ 2న టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: IND vs WI Pitch Report: రెండో టీ20 మ్యాచ్: పిచ్ రిపోర్ట్
ఆసియా కప్ టైమింగ్, షెడ్యూల్
ఆగస్ట్ 30 – పాకిస్తాన్ vs నేపాల్, ముల్తాన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
ఆగస్ట్ 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక, క్యాండీలో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
సెప్టెంబరు 2 – పాకిస్తాన్ vs భారతదేశం, క్యాండీలో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, లాహోర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
సెప్టెంబర్ 4 – భారత్ vs నేపాల్, క్యాండీలో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
సెప్టెంబర్ 5 – ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, లాహోర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు (గ్రూప్ స్టేజ్)
సెప్టెంబర్ 6 – A1 vs B2, మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) లాహోర్‌లో
సెప్టెంబర్ 9 – B1 vs B2, మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) కొలంబోలో
సెప్టెంబర్ 10 – A1 vs A2, మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) కొలంబోలో
సెప్టెంబర్ 12 – A2 vs B1, మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) కొలంబోలో
సెప్టెంబర్ 14 – A1 vs B1, మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) కొలంబోలో
సెప్టెంబర్ 15 – A2 vs B2 మధ్యాహ్నం 3 గంటలకు (సూపర్ 4) కొలంబోలో
సెప్టెంబర్ 17 – మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలో ఫైనల్.