Site icon HashtagU Telugu

Ajinkya Rahane : నాలో ఇంకా చాలా క్రికెట్ ఉంది.. వైస్ కెప్టెన్సీపైనా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు

Ajinkya Rahane Tells Reporter 'i Am Still Young'

Ajinkya Rahane Tells Reporter 'i Am Still Young'

Ajinkya Rahane : అజంక్య రహానే.. భారత్ క్రికెట్ లో క్లాసిక్ ప్లేయర్.. ముఖ్యంగా టెస్టుల్లో ఆధారపడదగిన ఆటగాడు.. క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బందే.. ఎన్నో సార్లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. అయితే గత ఏడాది ఫామ్ కోల్పోయిన రహానే (Ajinkya Rahane) కొన్నాళ్ళు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి విండీస్ టూర్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం విండీస్ తో సీరీస్ లో టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు. తాజాగా తొలి టెస్టుకు ముందు బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వూలో వైస్ కెప్టెన్సీపై రహానే (Ajinkya Rahane) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైస్ కెప్టెన్ పాత్ర తనకు అలవాటేననీ, దాదాపు 4-5 ఏళ్లు వైస్ కెప్టెన్‌గా ఉన్నాననీ గుర్తు చేశాడు. ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చినందుకు, అలాగే రోహిత్ కు డిప్యూటీగా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు.

కాగా పరోక్షంగా రిటైర్మెంట్ గురించి అడగ్గా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఇంకా కుర్రాడినేనని, తనలో ఇంకా చాలా క్రికెట్ ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో బాగా ఆడాననీ, అంతకుముందు దేశవాళీల్లో కూడా రాణించాననీ గుర్తు చేశాడు. తన బ్యాటింగ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని, కొన్ని లోటుపాట్లను సరిచేసుకున్నానని చెప్పుకొచ్చాడు. గత ఏడాదిన్నరగా ఫిట్‌నెస్‌పై కూడా బాగా ఫోకస్ పెట్టాననీ చెప్పాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్, క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నాననీ, భవిష్యత్తుపై ఇప్పుడే ఏం చెప్పలేనని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరిగే ప్రతి మ్యాచ్ తనకే కాకుండా టీమ్ పరంగా కూడా ముఖ్యమేననీ, కరేబియన్ గడ్డపై రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

Also Read:  KTR: కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ రైతాంగం తిప్పికొట్టాలి: కేటీఆర్

కాగా విండీస్ టూర్ భారత్ రెండు టెస్టులు , మూడు వన్డేలు, అయిదు టీ ట్వంటీలు అడనుంది. జూలై 12 నుంచి జూలై 16 వ‌ర‌కు తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ త‌ర్వాత దాదాపు నెల రోజుల విరామం ల‌భించింది. దీంతో ఆట‌గాళ్లంద‌రూ రెట్టించిన ఉత్సాహంతో టెస్టు సిరీస్ ఆడేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నారు. తొలి టెస్టు డొమినికా పార్కులో జ‌ర‌గ‌నుండగా.. రెండో టెస్టు ట్రినిడాడ్‌ క్వీన్స్ పార్క్ ఓవ‌ల్‌లో జూలై 20 నుంచి జూలై 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. రెండు టెస్టు మ్యాచుల త‌ర్వాత జూలై 27 నుంచి వ‌న్డే సిరీస్ మొద‌లు కానుంది.

భార‌త టెస్టు జ‌ట్టు :

రోహిత్ శ‌ర్మ ( కెప్టెన్ ) , శుభ్ మన్ గిల్, రుత్ రాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్, అజింక్యా ర‌హానే ( వైస్ కెప్టెన్) కేఎస్ భ‌ర‌త్, ఇషాన్ కిష‌న్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా, శార్ధుల్ ఠాకుర్, అక్ష‌ర్ ప‌టేల్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్, న‌వదీప్ షైనీ

Also Read:  Hyundai Exter Super Features : ఆర్డినరీ ప్రైస్ లో ఎక్స్ ట్రాడినరీ వెహికల్.. హ్యుందాయ్ ‘ఎక్స్ టర్’