ఐపీఎల్ 16వ సీజన్‌లో 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సొంతగడ్డపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. శనివారం (ఏప్రిల్ 8) వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 159 పరుగులు చేసి విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి సీజన్‌లో రెండో విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. తన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
Also Read: Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
అయితే ఈ మ్యాచ్ లో అజింక్యా రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ నుండి పరుగుల తుఫాను వచ్చింది. 27 బంతులు ఎదుర్కొన్న రహానే 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో రహానే 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 16వ సీజన్‌లో రహానేకి ఇదే తొలి మ్యాచ్. మొయిన్ అలీ అన్ ఫిట్ కావడంతో అతనికి అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ లో అజింక్యా రహానే విశ్వరూపం ప్రదర్శించారు. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు.ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక రన్స్ (23) కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 19 బంతుల్లోనే రహానే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కాగా బట్లర్, శార్దూల్‌లు ఈ సీజన్‌లో 20 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకోగా.. తాజాగా వీరిద్దరిని రహానే అధిగమించాడు.
చెన్నై తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రహానే నిలిచాడు. ఇతడితో పాటు చెన్నై తరఫున మొయిన్ అలీ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. గతేడాది ఆర్ఆర్‌పై ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో సీఎస్‌కే తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా పేరిట ఉంది. 2014లో పంజాబ్ కింగ్స్ మీద రైనా 16 బంతుల్లోఅర్థ సెంచరీ చేశాడు.