South Africa: భారత్, దక్షిణాఫ్రికా (South Africa) మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 14 నుండి 16 వరకు జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడో రోజు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌కు షాక్ ఇచ్చింది. తొలి రెండు రోజులు ఆధిపత్యం చూపిన టీమ్ ఇండియా, మూడో రోజు నిరాశపరిచే ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా భారత గడ్డపై 15 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమ్ ఇండియా పేరిట అనేక అవమానకరమైన రికార్డులు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికాకు 15 ఏళ్ల తర్వాత విజయం
తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 93 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. భారత గడ్డపై దక్షిణాఫ్రికా చివరిసారిగా 2010లో భారత్‌పై టెస్ట్ విజయం సాధించింది.
టెస్ట్ చరిత్రలో భారత్ ఛేదించలేని అతి చిన్న లక్ష్యాలలో రెండవది
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ లక్ష్యాలను ఛేదించడంలో భారత్ విఫలమవడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికాపై భారత్‌కు 124 పరుగుల లక్ష్యం లభించింది. అంతకుముందు 1997లో వెస్టిండీస్‌పై 120 పరుగుల అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై ఓడిపోయింది.
Also Read: Dalai Lama: దలైలామా తొలి మూల హిందీ జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ!
భారత్ ఛేదించడంలో విఫలమైన అత్యల్ప లక్ష్యాలు
- 120 వర్సెస్ వెస్టిండీస్, బ్రిడ్జ్‌టౌన్ 1997
- 124 వర్సెస్ దక్షిణాఫ్రికా, ఈడెన్ గార్డెన్స్ 2025
- 147 వర్సెస్ న్యూజిలాండ్, వాంఖడే 2024
- 176 వర్సెస్ శ్రీలంక, గాలే 2015
- 193 వర్సెస్ ఇంగ్లాండ్, లార్డ్స్ 2025
- 194 వర్సెస్ ఇంగ్లాండ్, ఎడ్జ్‌బాస్టన్
దక్షిణాఫ్రికా విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యాలు
ఈ విజయం ద్వారా టెస్ట్ చరిత్రలో దక్షిణాఫ్రికా విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యాలలో ఇది రెండవదిగా నిలిచింది.
- 117 వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ 1994
- 124 వర్సెస్ భారత్, ఈడెన్ గార్డెన్స్ 2025
- 146 వర్సెస్ పాకిస్తాన్, ఫైసలాబాద్ 1997
భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లలో విజయవంతంగా డిఫెండ్ చేయబడిన అత్యల్ప లక్ష్యాలు
భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లలో విజయవంతంగా డిఫెండ్ చేయబడిన అత్యల్ప లక్ష్యాలలో ఇది రెండవది.
- 107 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, వాంఖడే 2004
- 124 దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్, ఈడెన్ గార్డెన్స్ 2025
- 147 న్యూజిలాండ్ వర్సెస్ భారత్, వాంఖడే 2024
- 170 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్ 1996
