Afghanistan Ban: ఐపీఎల్ లో ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటంపై ప్రశ్నార్థకమైంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సిరీస్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఆడతారా లేదా అన్నది అనుమానమే.

Afghanistan Ban: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటంపై ప్రశ్నార్థకమైంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సిరీస్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఆడతారా లేదా అన్నది అనుమానమే. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ నవీన్-ఉల్-హక్ ప్రపంచకప్‌ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా దీనికి అంగీకరించింది. అంతేకాకుండా నవీన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, బసల్ హక్ బారుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆఫ్ఘనిస్థాన్ టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో జరిగే ప్రీమియర్ లీగ్ టీ20 సిరీస్‌లో ఆడేందుకు వాళ్లంతా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఆటగాళ్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన ఆఫ్ఘన్‌ బోర్డు ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు ఈ ముగ్గురు ఆటగాళ్లు వచ్చే రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే ఐపీఎల్, పీబీఎల్ తదితర టీ20 సిరీస్‌లలో ఆడకుండా నిషేధం విధించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆఫ్ఘన్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు వ్యక్తిగత లబ్ధి పొందారనే అనుమానంతో ఏసీబీ విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సదరు ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.

Also Read: Ajit Pawar Jail: అజిత్ పవార్ జైలుకే