Site icon HashtagU Telugu

ISPL 2023: చెన్నై జట్టు ఓనర్ గా హీరో సూర్య

ISPL 2023

ISPL 2023

ISPL 2023: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సిరీస్‌లో చెన్నై జట్టును తమిళ సినీ ప్రముఖ నటుడు సూర్య కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. గల్లీ టాలెంట్ ను బయటకు తీసి అంతర్జాతీయ క్రికెటర్లుగా మార్చాలన్న సంకల్పంతో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.

టీ20 క్రికెట్ మ్యాచ్‌ల తరహాలో టీ10 టోర్నీలు జరుగుతున్నాయి. 10 ఓవర్ల ఫార్మెట్లో జరగనున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి, ఈ సిరీస్‌లో ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు పాల్గొంటాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబై జట్టును, నటుడు రామ్ చరణ్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు. బెంగళూరు జట్టును హృతిక్ రోషన్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరో సూర్య చేరిపోయాడు.

ఐపీఎల్ సక్సెస్ ఫార్ములా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. బీసీసీఐని రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా నిలబెట్టడంలో ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ క్రికెట్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నది. ఈ సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రిని కన్సల్టెంట్‌గా నియమించారు.

Also Read: Shani Dev: పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి.. చేశారంటే శని ఆగ్రహానికి గురవ్వాల్సిందే?