Site icon HashtagU Telugu

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 37 బంతుల్లో సెంచరీ, రికార్డుల మోత కూడా!

ICC T20 Rankings

ICC T20 Rankings

Abhishek Sharma: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ కేవ‌లం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తొలుత‌ 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన అభిషేక్ ఆ త‌ర్వాత 20 బంతుల్లో మరో 50 పరుగులు చేశాడు. దీంతో కేవలం 37 బంతుల్లోనే అభిషేక్ సెంచ‌రీ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Also Read: WTC Format: ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారీ మార్పులు!

అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌

ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో భారత్‌కు అభిషేక్ శర్మ అద్భుత శుభారంభం అందించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 4.2 ఓవర్లలో అతను జామీ ఓవర్టన్ ఓవ‌ర్‌లో సిక్స్ కొట్టి T-20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించిన భారతదేశం తరపున రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీంతోపాటు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను 10 సిక్స్‌లు, 5 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ 270.27 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ వార్త రాసే స‌మ‌యానికి భార‌త్ జ‌ట్టు 13 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు న‌ష్ట‌పోయి 178 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌తో పాటు శివ‌మ్ దూబే ఉన్నాడు.

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌కు పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జ‌ట్టుగా భారత రికార్డును కూడా సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 ఓవర్లలో 95 పరుగులు చేసింది. అంతకుముందు స్కాట్లాండ్‌పై టీమిండియా 82 పరుగులు చేసింది. 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన పవర్‌ప్లేలో భారత్ 82 పరుగులు చేసింది. 2018లో దక్షిణాఫ్రికాపై మెన్ ఇన్ బ్లూ 78 పరుగులు చేసింది.

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పవర్‌ప్లే టోటల్