Site icon HashtagU Telugu

AB de Villiers On Rohit Sharma: రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి? ఏబీ డివిలియ‌ర్స్ కీల‌క వ్యాఖ్య‌లు!

AB de Villiers On Rohit Sharma

AB de Villiers On Rohit Sharma

AB de Villiers On Rohit Sharma: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. గతేడాది కూడా రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే దీనికి ముందు రోహిత్‌పై విమర్శకులందరూ అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు చేశారు. దీనిపై దక్షిణాఫ్రికాకు చెందిన గొప్ప బ్యాట్స్‌మెన్ AB డివిలియర్స్ రోహిత్ శర్మ పదవీ విరమణ (AB de Villiers On Rohit Sharma) చేయవలసిన అవసరం లేదని, అతను వన్డే క్రికెట్ గొప్ప కెప్టెన్లలో ఒకడు అవుతాడని అభిప్రాయపడ్డాడు.

ఇతర కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ విజయాల శాతం 74 శాతం ఉందని, ఇది గత కెప్టెన్ల కంటే మెరుగైనదని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. అతను ఆడుతూ ఉంటే.. రోహిత్ ఆల్‌ టైమ్ అత్యుత్తమ వన్డే కెప్టెన్లలో ఒకడు అవుతాడని చెప్పాడు. అతను ఎందుకు రిటైర్ కావాలి? కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గానూ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడని ఏబీ చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులతో భారత్‌కు శుభారంభం అందించి విజయానికి పునాది వేశాడు. ఒత్తిడి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అతను ముందు నుండి నడిపించాడని తెలిపాడు.

Also Read: KKR: కేకేఆర్ నాలుగోసారి టైటిల్ గెల‌వ‌గ‌ల‌దా? జ‌ట్టు బ‌లం ఇదే!

ఇక రోహిత్ శర్మ రిటైర్ కావాల్సిన అవసరం లేదని ఏబీడీ తెలిపాడు. ఎలాంటి విమర్శలు వినాల్సిన అవసరం కూడా రోహిత్‌కు లేదు. అతని రికార్డు స్వయంగా మాట్లాడుతుంది. అతను తన ఆటను కూడా మార్చుకున్నాడు. పవర్‌ప్లేలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా, అతని స్ట్రైక్ రేట్ అంత ఎక్కువగా లేదు కానీ.. 2022 తర్వాత మొదటి పవర్‌ప్లేలో అది 115గా మారిందని గుర్తుచేశాడు.

ఇక‌పోతే రోహిత్ శ‌ర్మ ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ త‌ర్వాత తాను వ‌న్డేల నుంచి రిటైర్ అవ్వ‌టంలేద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగుల కీల‌క ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ జ‌ట్టుకు ట్రోఫీ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే రోహిత్ 2027లో జ‌ర‌గ‌బోయే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడాల‌ని బ‌లంగా కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.