- టీ20 ప్రపంచ కప్‌కు ముందు పాక్ జట్టులో కీలక మార్పులు
- కోచ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన పీసీబీ
Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు జరగడం కొత్తేమీ కాదు. అక్కడ అప్పుడప్పుడు కెప్టెన్ మారుతుంటారు. మరికొన్ని సార్లు కోచ్‌లపై వేటు పడుతుంటుంది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణం. అయితే 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్ క్రికెట్‌లో మరో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. జట్టు తాత్కాలిక కోచ్‌ను పదవి నుంచి తొలగించారు. రాబోయే మెగా టోర్నమెంట్‌కు ముందు ఇది ఒక కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పెను మార్పు
పాకిస్థాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా అజహర్ మహమూద్ పదవీకాలం ముగిసింది. ఈ ఏడాది జూన్‌లో అజహర్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించారు. వాస్తవానికి ఆయన ఒప్పందం మార్చి 2026 వరకు ఉంది. అయితే మార్చి 2026 వరకు పాకిస్థాన్ ఎలాంటి టెస్ట్ సిరీస్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో అజహర్ మహమూద్ తన పదవీకాలాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. 2024లో వైట్ బాల్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్, రెడ్ బాల్ కోచ్ జేసన్ గిలెస్పీలకు సహాయకుడిగా (అసిస్టెంట్ కోచ్) అజహర్‌ను నియమించారు.
Also Read: తెలంగాణలో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!
జట్టును వీడిన అనంతరం అజహర్ ప్రకటన
జట్టు నుంచి తప్పుకున్న తర్వాత అజహర్ మహమూద్ ‘క్రిక్ ఇన్ఫో’తో మాట్లాడుతూ.. పీసీబీ నన్ను ఒక నిర్దిష్ట కాలానికి నియమించింది. ఆ సమయంలో నేను పూర్తి వృత్తి నైపుణ్యం, అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు నా ఒప్పందం ముగిసింది. భవిష్యత్తులో పాక్ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
క్రికెట్ కెరీర్ విశేషాలు
అజహర్ మహమూద్ పాకిస్థాన్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశారు.
- టెస్టులు: 21 మ్యాచ్‌ల్లో 900 పరుగులు చేసి, 39 వికెట్లు పడగొట్టారు.
- వన్డేలు: 143 మ్యాచ్‌ల్లో 1521 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశారు.
- ఆయన తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2007లో ఆడారు.
