Site icon HashtagU Telugu

Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !

22 03 2023 Ind Vs Aus Top 5 Villian 23364236

22 03 2023 Ind Vs Aus Top 5 Villian 23364236

Team India: టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఘోరంగా ఓడిపోయారు. దీనివల్ల నెంబర్ వన్ స్థానాన్ని తన చేతులారా పోగొట్టుకున్నారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఎంత ఇంపార్టెంటో ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా అంతే ముఖ్యం.వరల్డ్‌ కప్‌ రిహార్సల్స్ అని భావించిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఓడిపోయి క్రికెట్ భారతావనికి నిరాశ తెప్పించారు.

అస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోవటం వల్ల తమ ర్యాంకింగ్ లను కూడా కోల్పోయారు మన క్రికెటర్లు. ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ హాజిల్‌వుడ్‌ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ 702 పాయింట్లతో ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 3వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్‌ రెండో వన్డేలో మూడు ఓవర్లలోనే 37రన్స్‌ ఇచ్చాడు. దీంతో భారీగా ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోయాడు. అయితే షమీకి మాత్రం ఈ పాయింట్లు పస్ల్ అయ్యాయి. ముంబై వన్డేలో భారత్‌ను గెలిపించిన మహ్మద్‌ షమీ అయిదు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

అటు తొలి వన్డేలో 75 పరుగులతో టీమ్‌ఇండియాను గెలిపించిన రాహుల్‌ మూడు స్థానాలు మెరుగై 39వ ర్యాంక్‌కు చేరుకోగా, గిల్‌, కోహ్లీ అయిదు, ఏడు ర్యాంక్‌లలో కొనసాగుతున్నారు. కెప్టెన్ రోహిత్ మాత్రం 9వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు.