T20 World Cup Final : ఫైనల్ కు వర్షం ముప్పు మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు ?

ఆదివారం కూడా వర్షం పడే అవకాశముండడం అటు నిర్వాహకులను, ఇటు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 09:09 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup Final ) కు ఈ సారి రెండు దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అయితే రెండు దేశాల్లోనూ పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉన్నాడు. కొన్ని మ్యాచ్ లు రద్దవడం. కొన్నింటికి ఓవర్లు కుదించడం జరిగాయి. ఇప్పుడు టోర్నీ చివరి దశకు చేరింది. శనివారం జరిగే టైటిల్ పోరులో భారత్ , సౌతాఫ్రికా (South Africa and India) తలపడనున్నాయి. అయితే ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బార్బడోస్ లో శనివారం 75 శాతం వర్షం కురిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విండీస్ లో ప్రస్తుతం వర్షం కాలం కావడంతో రోజు వర్షాలు పడుతున్నాయి. కాగా ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం అంతరాయంతో శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆదివారం కూడా వర్షం పడే అవకాశముండడం అటు నిర్వాహకులను, ఇటు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. రెెెండురోజుల్లో ఆట నిర్వహణ కోసం 190 నిమిషాలు అదనపు సమయాన్నీ కూడా కేటాయించారు. ఐసీసీ నాకౌట్ నిబంధనల ప్రకారం ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడితేనే ఫలితాన్ని ప్రకటిస్తారు. చివర్లో సూపర్ ఓవర్ అయినా ఆడించి విజేతలను తేలుస్తారు. ఒకవేళ రెండు రోజుల్లో పైవేవీ సాధ్యం కాకుంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో భారత్, సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరాయి. సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ చేరితే… భారత్ పదేళ్ల తర్వాత మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓవరాల్ గా భారత్ కు ఇది మూడో ఫైనల్. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగానే కనిపిస్తుండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Read Also : Health: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలోకండి!