Site icon HashtagU Telugu

112 Year Old Record: 112 ఏళ్ల రికార్డును స‌మం చేసిన‌ టీమిండియా..!

ICC Test Team Rankings

Safeimagekit Resized Img (5) 11zon

112-Year-Old Record: ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకుంది. ధర్మశాల విజయంతో భారత జట్టు 112 ఏళ్ల రికార్డు (112-Year-Old Record)ను సమం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే.

వాస్తవానికి ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత రోహిత్ సేన‌ బలమైన పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలిచి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి.

ఆస్ట్రేలియా జట్టు ఇలా రెండు సార్లు విజ‌యం సాధించింది. ఇంగ్లండ్ జ‌ట్టు ఒక‌సారి గెలిచింది. ఇప్పుడు భారత జట్టు ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా అవతరించింది. 112 ఏళ్ల క్రితం టెస్టు క్రికెట్‌లో చివరిసారి ఇలా జరిగింది. 1912లో తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ అద్భుతంగా పునరాగమనం చేసి మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read: IND vs ENG Test Series: భారత్ పై ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులకే ఆలౌటైంది. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బదులుగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ తరఫున రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేశారు. కాగా.. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీలు చేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

రోహిత్‌ శర్మ అరుదైన ఘనత

ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1‌తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది 400వ విజయం.

We’re now on WhatsApp : Click to Join

బీసీసీఐ కీలక ప్ర‌క‌ట‌న‌

టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 లీగ్‌ల వైపు మొగ్గు చూపే క్రికెటర్లను అడ్డుకొనేందుకు తాజాగా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీం’ను బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. దీనికోసం రూ.40 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌ ప్లేయర్లు అందుకుంటున్న‌ ఫీజుతో పాటు అదనంగా ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ఇన్సెంటివ్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు.