5 Players Injured: ఒకే రోజు ఐదుగురు ఆటగాళ్లకు గాయాలు

ఒక్కరోజు ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. ప్రపంచ కప్ కి ముందు ఆటగాళ్లు గాయపడుతుండటం మేనెజ్మెంట్ ను ఆందోళనకు గురి చేస్తుంది. వన్డే ప్రపంచ అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది.

5 Players Injured: ఒక్కరోజు ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. ప్రపంచ కప్ కి ముందు ఆటగాళ్లు గాయపడుతుండటం మేనెజ్మెంట్ ను ఆందోళనకు గురి చేస్తుంది. వన్డే ప్రపంచ అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ కి ముందు ప్రధాన జట్లు ఆయా టోర్నీలో ఆడుతున్నారు. టీమిండియా ఆసియా కప్ లో ఆడుతున్న విషయం తెలిసింది. కాగా నిన్న శుక్రవారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో దాదాపు అన్ని జట్ల ఆటగాళ్లకు గాయాల సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కీలక ప్లేయర్లు గాయపడటంతో మేనేజ్‌మెంట్లు ఆందోళన చెందుతున్నాయి.

ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. ఎడమ చేతికి గాయం కావడంతో హెడ్ రానున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనడంపై సందేహాలు తలెత్తాయి. న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గవ వన్డే 7వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ షార్ట్ బాల్ అడగ… బంతి బలంగా ఎడమ చేతి గ్లోవ్‌ను తాకింది, ఆ తర్వాత మరో మూడు బంతులు ఎదుర్కొన్నాడు. కానీ అసౌకర్యంగా అనిపించడంతో హెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు.

శుక్రవారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కుడి బొటన వేలికి గాయం కావడంతో వచ్చే ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై సందేహం నెలకొంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో సౌదీకి క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో గాయమైంది. కాగా అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ కోసం ఈ ప్లేయర్ ఎంపికయ్యాడు.

శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్వల్పంగా గాయపడ్డాడు. 42 పరుగులు చేసిన అక్షర్ ఎడమ మణికట్టు మరియు మోచేయి గాయంతో ఆసియా కప్ ఫైనల్ కి దూరమయ్యాడు. దీంతో బిసిసిఐ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టే క్రమంలో న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ గాయపడ్డాడు. మిచెల్ వేలికి తగిలిన గాయం పెద్దదేనని తెలుస్తుంది. ఇక అదే మ్యాచ్‌లో ఫిన్ అలెన్ కూడా 12వ ఓవర్‌లో గాయానికి గురయ్యాడు.

శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయం కారణంగా భారత్‌తో జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో తీక్షణ స్వల్ప అస్వస్థకు లోనయ్యాడు. దీంతో తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను జట్టులోకి తీసుకున్నారు.

Also Read: ED Raids : రాజస్థాన్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు