Site icon HashtagU Telugu

Happy Birthday Rahul Dravid: నేడు గ్రేట్‌వాల్‌ ద్రవిడ్‌ పుట్టిన రోజు.. ద్రవిడ్‌ గురించి ఇవి తెలుసా..?

Rahul Dravid

Rahul Dravid

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్‌ సేవలందించారు. భారత్‌ కష్టాల్లో ఉన్న ప్రతీసారి వికెట్ల మధ్య అడ్డుగోడలా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ది వాల్, మిస్టర్ డిఫెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్.. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. క్రికెట్ నుంచి రిటైరైనా.. అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనవరి 11, 1973 ఇండోర్‌లో జన్మించిన ద్రవిడ్‌.. టెస్టు మ్యాచ్ తో క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

Also Read: Rohit Sharma: క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. ఏం చేశాడో తెలుసా..!

టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు: టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ మాత్రమే. అతను గేమ్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో మొత్తం 31,258 బంతులు ఎదుర్కొన్నాడు.

టెస్టుల్లో గోల్డెన్ డక్‌ లేదు: తాను ఆడిన 286 టెస్టు ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ లేని రికార్డును కలిగి ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ భారత కోచ్ ద్రవిడ్.

అత్యధిక వంద పరుగుల భాగస్వామ్యాలు: మిస్టర్ డిపెండబుల్ టెస్టుల్లో అత్యధికంగా వంద పరుగుల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా పిలుస్తారు. మొత్తం 210 క్యాచ్‌లు ద్రవిడ్ పేరు మీద ఉన్నాయి.

క్రీజ్‌లో బ్యాట్స్‌మెన్ గడిపిన అత్యధిక నిమిషాలు: క్రీజులో అత్యధిక నిమిషాలు గడిపిన ఏకైక టెస్టు బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ . అతను మొత్తం 735 గంటల 52 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అంటే 44,152 నిమిషాలకు సమానం.