Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!

  • Written By:
  • Updated On - June 17, 2024 / 11:23 PM IST

Lockie Ferguson: T20 వరల్డ్ కప్ 2024లో ఈరోజు న్యూజిలాండ్- PNG (పాపువా న్యూ గినియా)తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీఎన్‌జీని తక్కవ స్కోరుకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ విధంగా రికార్డు చేయలేదు. ఇంతకీ లాకీ ఫెర్గూసన్ ఏ చరిత్ర సృష్టించాడో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌

న్యూజిలాండ్- PNG మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్ తన స్పెల్‌లో 4 ఓవర్లు పూర్తి చేశాడు. ఈ 4 ఓవర్లలో లాకీ ఫెర్గూసన్ 0 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 4 మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 7.15 ఎకానమీతో మొత్తం 61 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు లాకీ ఫెర్గూసన్ ఈ 42 మ్యాచ్‌ల్లో కేవలం 5 మెయిడిన్ ఓవర్లు మాత్రమే వేశాడు.

Also Read: Good News : ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపిన కూటమి సర్కార్

ఇంతకుముందు ఈ రికార్డు ఈ ఆటగాడి పేరిట ఉండేది

లాకీ ఫెర్గూసన్ కంటే ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ పేరిట ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఉగాండాపై టిమ్ సౌథీ ఈ రికార్డు సృష్టించాడు. ఉగాండాపై టిమ్ సౌథీ 4 ఓవర్లలో 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా ఆటగాడు ఫ్రాంక్ న్సుబుగా పీఎన్‌జీపై 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్ బౌలింగ్ చేసిన ప్రపంచంలో మూడో ఆటగాడు.

We’re now on WhatsApp : Click to Join

టీ20 క్రికెట్‌లో ఓ రికార్డు ఉంది

ఇక టి20 క్రికెట్ చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పటి వరకు కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ పేరిట ఈ ఘనత ఉండేది. నవంబర్ 2021లో పనామాపై సాద్ బిన్ జాఫర్ అద్భుతమైన స్పెల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సాద్ మొత్తం నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు.