T20 World Record: టి20 ఫార్మేట్ రాకతో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. బౌలర్లు నిస్సయస్థితిలో కనిపిస్తుండగా బ్యాట్స్ మెన్లే ఆధిపత్యం కనబరుస్తున్నారు. కనీవినీ ఎరుగని రికార్డుల్ని నెలకొల్పడంలో ఈ ధనాధన్ ఫార్మేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు 20 ఓవర్లలో అతికష్టం మీద 100 పరుగుల మార్క్ ను అందుకునేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో 250 పరుగులను కూడా సునాయాసంగా రాబడుతున్నారు.
తాజాగా ఓ యువ బ్యాట్స్ మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డ్ ఇదివరకే నమోదయినప్పటికీ ఈ ఒక్క ఓవర్లో 39 పరుగులు రావడం చర్చనీయాంశమైంది. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే కావడం గమనార్హం. సమోవా, వనాటు మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన టీ20 ఓవర్‌గా రికార్డు సృష్టించింది. వనాటు బౌలర్ నలిన్ నిపికో వేసిన బౌలింగ్ లో సమోవా బ్యాట్స్‌మెన్ డారియస్ విస్సర్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే ఈ ఓవర్‌లో మొత్తం 39 పరుగులు రాగా, ఈ ఓవర్ టీ20 క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నమోదైంది. ఓవర్ తొలి బంతికి సిక్సర్, రెండో బంతికి సిక్సర్, మూడో బంతికి సిక్సర్, తర్వాత నో బాల్ వచ్చింది, నాలుగో బంతికి సిక్సర్ కొట్టినా పరుగులు రాలేదు. ఐదో బంతికి నో బాల్ వచ్చింది, ఆ తర్వాత నో బాల్ వచ్చింది, ఆరో బంతికి కూడా సిక్సర్ కొట్టారు. ఈ ఓవర్‌లో 6 సిక్సర్లు, 3 నో బాల్స్‌తో కలిపి మొత్తం 39 పరుగులు వచ్చాయి.
ఇన్నింగ్స్ లో డారియస్ విస్సర్ 62 బంతుల్లో 5 ఫోర్లు, 14 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా డారియస్ విస్సర్ నిలిచాడు. విస్సర్ కంటే ముందు యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, దీపేంద్ర సింగ్ ఎయిరీ ఈ ఘనత సాధించారు. 2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. అయితే టీ20 క్రికెట్ తీరు మారుతున్న క్రమంలో త్వరలో ఈ జాబితాలోకి చాలా మంది పేర్లు కూడా చేరే అవకాశం ఉంది.
Also Read: Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్