Site icon HashtagU Telugu

Mohammed Shami: వేలంలో షమీ కోసం పోటీ పడే జట్లు ఇవేనా?

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని (Mohammed Shami) విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. షమీ కోసం వేలంలో భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. గాయం నుంచి కోలుకున్న షమీ తాజాగా 7 వికెట్లతో సత్తా చాటాడు. రంజిలో బెంగాల్ త‌ర‌పున ష‌మీ కీల‌క‌మైన వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఫ్రాంచైజీల కన్ను షమీపై పడింది. ప్రధానంగా మూడు జట్లు షమీని దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్‌ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు. ఇప్పుడు బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీని కేకేఆర్ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది. షమీని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొనుగోలు చేయాలనుకుంటోంది. షమీకి ఢిల్లీతో పాత సంబంధం ఉంది. ఇప్పటివరకు అతను ఈ జట్టుతో ఎక్కువ సమయం గడిపాడు. 2014 నుండి 2018 వరకు 5 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాడు. పైగా ఢిల్లీ పంత్ లాంటి స్టార్ ప్లేయర్ను వదులుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ షమీ కోసం ఆరాటపడుతుంది. అయితే షమీని డీసీ కొనుగోలు చేయాలంటే వేలంలో భారీ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది.

Also Read: Vemulawada : వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

చెన్నై సూపర్ కింగ్స్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది. చెన్నై దీపక్ చాహర్‌ను విడుదల చేసింది. ఈ పరిస్థితిలో చెన్నైకి షమీ అవసరం చాలానే ఉంది. షమీకి ఉన్న అపారమైన అనుభవాణ్ని చెన్నై అటిలైజ్ చేసుకోవాలనుకుంటుంది. పైగా షమీ తన భీకర బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. కాగా చెన్నైలో ధోనీ ఉన్నాడు. వచ్చే సీజన్లో చెన్నై టైటిల్ గెలీవడం చాలా అవసరం. టైటిల్ తో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఫ్రాంచైజీ సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లు మాత్రమే కాక టైటిల్ విన్నర్లు అవసరం. దీంతో షమీని తమ జట్టులో చేర్చుకునేందుకు ధోనీ కూడా ప్రణాళికలు రచిస్తున్నాడట. జట్టు విజయంలో బౌలర్లదే కీలక పాత్ర అని ధోనీ బలంగా నమ్మే వ్యక్తి.. ఈ నేపథ్యంలో వేలంలోకి వచ్చిన షమీని ధోనీ వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేడు. మరి షమీ ఏ జట్టులోకి వెళితే బాగుంటుందో మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.