Andre Russell: IPL 2026 సీజన్‌కు ముందు నవంబర్ 15న వెలువడిన రిటెన్షన్ జాబితాలో ఒక అనూహ్య నిర్ణయం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తమ విధ్వంసక ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను (Andre Russell) విడుదల చేసింది. 2014 నుంచి KKR జట్టులో కీలక సభ్యుడిగా, మ్యాచ్ విన్నర్‌గా కొనసాగిన రసెల్‌ను విడుదల చేయడం నిజంగా షాకింగ్‌గా మారింది. దీంతో ఈ విండీస్ పవర్-హౌస్ ఇప్పుడు రాబోయే వేలంలోకి రానున్నాడు.
ఆండ్రీ రసెల్ ఎలాంటి ఆల్‌రౌండరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను బ్యాట్‌తో క్రీజులో నిలబడితే బౌలర్లకు దడ పుట్టడం ఖాయం. మైదానం నలువైపులా సిక్సర్లు కొట్టగలిగే సామర్థ్యం అతని సొంతం. అంతేకాకుండా బంతితో కీలక సమయాల్లో వికెట్లు తీయగల సత్తా కూడా రసెల్‌కు ఉంది. గత సీజన్‌లో రసెల్ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. అతనిలోని నిరూపితమైన మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం, మెరుపు ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని ఇతర జట్లు అతనిని తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్రంగా పోటీ పడటం ఖాయం. మరోసారి రసెల్‌కు కోట్లలో ధర పలకడం ఖాయమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
Also Read: Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బంగారం బాగా అదృష్టం తీసుకొస్తుంది.. తెలుసా.!
రసెల్ కోసం పోరాడే ప్రధాన జట్లు
IPL 2026 వేలంలో ఆండ్రీ రసెల్‌ను దక్కించుకోవడానికి ప్రధానంగా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
CSK జట్టు నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి కీలక ఆల్‌రౌండర్లు వెళ్లిపోవడంతో మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఫినిషింగ్ బాధ్యతలు స్వీకరించేవారు ధోని మినహా ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లో ఆండ్రీ రసెల్ CSKకి అద్భుతమైన ఎంపిక. క్రీజులోకి వచ్చిన వెంటనే హిట్టింగ్ చేయగల రసెల్.. ధోనికి తోడుగా బ్రహ్మాండమైన ఫినిషర్‌గా ఉపయోగపడగలడు. ప్రస్తుతం CSK వద్ద రూ. 43.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తమ జట్టులో ఉన్న బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రసెల్‌ను దక్కించుకోవడానికి CSK యాజమాన్యం గట్టి పట్టుదల చూపించవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
SRH జట్టుకు లోయర్ ఆర్డర్‌లో పవర్-హిట్టర్, నమ్మకమైన ఫినిషర్ కొరత చాలా కాలంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు. రసెల్ చేరికతో వారి బ్యాటింగ్ ఆర్డర్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. SRH వద్ద ప్రస్తుతం రూ. 25.5 కోట్లు అందుబాటులో ఉన్నాయి. రసెల్ లాంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కోసం వారు తమ బడ్జెట్‌ను లెక్క చేయకుండా పోరాడే అవకాశం ఉంది. వేలం పక్రియలో ఈ రెండు జట్ల మధ్య రసెల్‌ను దక్కించుకోవడానికి బిడ్డింగ్‌లో భీకర యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. రసెల్ ఏ జట్టులోకి వెళ్తాడనేది చూడాలంటే వేలం రోజు వరకు వేచి చూడాల్సిందే.
