YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. కారణమిదే..?

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర మరోసారి రద్దయింది. ప్రస్తుతం మహబూబాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడి స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మీద విమర్శలు చేసింది.

  • Written By:
  • Updated On - February 19, 2023 / 09:51 AM IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్ర మరోసారి రద్దయింది. ప్రస్తుతం మహబూబాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడి స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మీద విమర్శలు చేసింది. దింతో వైఎస్ షర్మిలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్ నాయక్ మీద చేసిన కామెంట్స్‌ వల్లే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ నుంచి పోలీసు వాహనంలో ఆమెను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: AP Assembly : ఫిబ్రవరి 27 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 15 రోజుల పాటు జ‌రిగే అవ‌కాశం

శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం షర్మిలను అరెస్ట్ చేశారు.