YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?

వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.

YS Sharmila: వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె బెంగుళూరులోని డీకే శివకుమార్ ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో డీకే కీలక పాత్ర పోషించాడని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక శివకుమార్ పాత్ర ఎంతో ఉన్నదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డీకేతో రాజకీయ చర్చలు జరిపారు. ఈ భేటీలో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేరు మారుమ్రోగింది. అధికార పార్టీని వెనక్కినెట్టి అక్కడ భారీ మెజారీటీతో గెలుపొందింది. అక్కడ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) లు ఎన్నికయ్యారు. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ చూపు తెలంగాణపై పడింది. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణాలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. గంటపాటు జరిగిన ఫోన్ సంభాషణలో తెలంగాణ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకుపడుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందామె. తాజాగా షర్మిల ప్రియాంక గాంధీతో సంభాషణ తరువాత కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య సంధి కుదిరినట్టు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు, సీఎం కెసిఆర్ ని గద్దె దెంచడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సన్నద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో శివకుమార్ షర్మిలతో ఇప్పటికే మాట్లాడినట్టు నెక్స్ట్ ఎలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో తెలంగాణాలో కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More: Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం