YS Sharmila: సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల గిఫ్ట్…

దేశంలో అత్యంత పొడవైన డా: బీఆర్ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో కొలువుతీరింది. ఈ రోజు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదా సాహెబ్ భారీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.

YS Sharmila: దేశంలో అత్యంత పొడవైన డా: బీఆర్ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో కొలువుతీరింది. ఈ రోజు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదా సాహెబ్ భారీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై ఇన్నాళ్లు లేని ప్రేమ ఎన్నికల సమయంలో వచ్చిందా అని ప్రశ్నించారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై కొలువై ఉన్న భారీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు షర్మిల ( YS Sharmila ). ఈ సందర్భంగా ఆమె అంబేడ్కర్ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.

తెలంగాణాలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందని విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. తెలంగాణాలో కూడా భారత రాజ్యాంగాన్ని అప్లయ్ చేయాలని దుయ్యబట్టారు షర్మిల. కేసీఆర్ కు ఎన్నిక సమయంలోనే దళితులు గుర్తుకు వస్తారు. దళితుల భూములు లాక్కున్న వ్యక్తి కెసిఆర్ అంటూ ఎండగట్టారు. భారీ విగ్రహాన్ని పెట్టడం ద్వారా దళితులపై కానీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కానీ ప్రేమ ఉన్నట్టు కాదు. అది కేవలం కెసిఆర్ రాజకీయ లబ్ది కోసమేనన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ పలుమార్లు కోరారు. అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యాంగం మార్పుని కోరుకుని దేశ రాజ్యాంగాన్ని అవమానపరిచాడని సీఎం కెసిఆర్ పై ఫైర్ అయ్యారు షర్మిల.

తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా చేయడం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణాలో ప్రతిపక్ష నేతల గొంతుకని నొక్కెయ్యాలని కెసిఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో విపక్షాలకు స్వచ్ఛనివ్వాలని కోరారు షర్మిల. వేలాది పుస్తకాలు చదివిన కెసిఆర్ రాజ్యాంగాన్ని చదవలేదా అని ప్రశ్నించారు. సీఎం కెసిఆర్ ని స్వయంగా కలిసి ఆయనకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని గిఫ్ట్ గా ఇస్తానని ఘాటుగా స్పందించారు ఆమె. అంబేడ్కర్ వారసుడ్ని నేనే అంటూ కెసిఆర్ గప్పాలు కొట్టుకుంటున్నారు. దీనికన్నా పెద్ద జోక్ మరేదీ ఉండదని చురకలంటించారు వైఎస్ షర్మిల.

Read More: YS Sharmila: తెలంగాణా ఆప్ఘనిస్తాన్, కేసీఆర్‌ తాలిబన్‌.. వైఎస్‌ షర్మిల షాకింగ్ కామెంట్స్!