Site icon HashtagU Telugu

YS Sharmila Video: కల్లు తాగిన షర్మిల.. నెట్టింట వీడియో వైరల్!

Sharmila

Sharmila

ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది వైఎస్ షర్మిల (YS Sharmila). ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పాదయాత్రలో భాగంగా పాలకుర్తిలో పర్యటిస్తున్న షర్మిల (YS Sharmila) కల్లు (నీరా) రుచి చూశారు. కల్లు తాగడం తనకు అలవాటు లేదని.. కానీ గీత కార్మికుడి అభ్యర్థన మేరకు రుచి చూశానని తెలిపారు. గీత కార్మికుడితో కాసేపు మాట్లాడిన షర్మిల వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ముందుగా గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని.. వారికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఇక షర్మిల (YS Sharmila) కల్లు (నీరా) రుచి చూసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Singer Sunitha: నేను ప్రెగ్నెంటా.. నాకే తెలియదు : రూమర్స్ పై సునీత రియాక్షన్!