Delimitation : వైసీపీ అధినేత వైఎస్ జగన్ డీలిమిటేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని ప్రధాని మోడీని జగన్ కోరారు. అలాగే 2026 లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందని ఈ డీలిమిటేషన్ వల్ల ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Read Also: Pak Cricketer: బ్యాట్‌లకు డబ్బు చెల్లించకుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!
మరోవైపు ఈరోజు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోడీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడ్తున్నాయి. ఈ అంశంపై ఆల్‌పార్టీ మీటింగ్‌లో విస్తృతంగా చర్చించారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్