YS Jagan : వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని జగన్ ఆరోపించారు. బడ్జెట్‌లో చెప్పిన లెక్కలు, బయట చెప్పే లెక్కలకు తేడా ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. మీ బడ్జెట్ లెక్కలను మీరే మార్చి చెప్తున్నారు అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
2018-19 నాటికి ప్రభుత్వం 3 లక్షల అప్పులు చేసిందని తెలిపారు. వాస్తవాలు ఏంటో బాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయి. తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారు. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా వృద్ది రేటు మందగించింది అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకనే బడ్జెట్ ను ఆలస్యం చేశారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్ష94వేల కోట్లు అని చెప్పారు. కాగ్ రిపోర్టు 6వేల కోట్లు చెబితే.. చంద్రబాబు మాత్రం 11 వేల కోట్లు అని చెబుతుందని పేర్కొన్నారు.
ఇకపోతే..2019లో బాబు 42వేల 183 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లారని విమర్శించారు. ఐదేళ్ల బాబు హయాంలో FRBM పరిధి దాటి 28 వేల 457 కోట్ల అప్పు అన్నారు. మా హయాంలో FRBM పరిధి దాటి 16 వందల 47 కోట్లు మాత్రమే అప్పు అని చెప్పారు. ఎవరి హయాంలో అప్పులు ఎక్కువయ్యాయో లెక్కలే చెప్తున్నాయి. మీ లెక్కలను మీరే ఒప్పుకోకపోతే బడ్జెట్ ఎందుకు పెట్టినట్టు? అని.. బడ్జెట్‌లో ఒకటి పెట్టి బయట మరొకటి చెబుతున్నారని జగన్ కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.
Read Also: Naga Chaitanya : తండేల్ బుజ్జి తల్లి అప్డేట్.. డీఎస్పీ రంగంలోకి దిగాడోచ్..!