YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్య తిరిగి తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుంది.

YS Avinash Reddy: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్య తిరిగి తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుంది. సొంత బంధువులే వివేకాను హత్య చేసినట్టు వైఎస్ కుమార్తె సునీత ఆరోపించింది. ఈ మేరకు కేసును క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రిని కస్టడీకి తీసుకుంది. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి హస్తమున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. ఈ మేరకు అవినాష్ కు సీబీఐ ఇప్పటికే నోటీసులిచ్చి విచారించింది. కాగా ప్రస్తుతం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్య పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోతున్నానంటూ సీబీఐకి లేఖ రాశారు. ఇదిలా ఉండగా సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ తిరిగి అవినాష్ కు లేఖ రాసింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి కోసం సీబీఐ రంగంలోకి దిగింది.

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షి కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె గత వారం గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అవినాష్ రెడ్డి కూడా తల్లిని విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదు. మరోవైపు సీబీఐ రెండు బృందాలు నిన్న కర్నూలో చేరుకున్నాయి. స్థానిక ఎస్పీతో సంప్రదింపులు జరిపి అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతున్నట్టు, అవినాష్ రెడ్డిని లొంగిపోవాల్సిందిగా చెప్పాలని ఎస్పీని కోరినట్టు సమాచారం. ఇక అవినాష్ రెడ్డి అరెస్టుపై వస్తున్న వార్తల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

కర్నూల్ వచ్చిన సిబిఐ రెండు బృందాల్లో ఒక బృందం రాత్రి కర్నూల్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. మరో బృందం ఏ క్షణమైనా అవినాష్ ని హైదరాబాద్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తమ నాయకుడిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేస్తారేమోనని కార్యకర్తలు, అనుచరులు రాత్రంతా ఆస్పత్రి వద్దే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు స్థానిక వైసీపీ నాయకులు చూసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రిని వీడమంటూ వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. దీంతో ఈ రోజు కూడా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Read More: Virat Kohli: కోహ్లీ జట్టు మారాల్సిన సమయం వచ్చింది.. ఢిల్లీ జట్టుకు మారిపో అంటూ పీటర్సన్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!