ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస్టంలో సమస్య వల్ల యూట్యూబ్ హోంపేజీ, యాప్, యూట్యూబ్ కిడ్స్, మ్యూజిక్‌లో వీడియోలు రాలేదని తెలిపింది. లాగిన్ కాలేకపోయామని కొందరి […]

Published By: HashtagU Telugu Desk
Youtube

Youtube

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది.

రికమెండేషన్ సిస్టంలో సమస్య వల్ల యూట్యూబ్ హోంపేజీ, యాప్, యూట్యూబ్ కిడ్స్, మ్యూజిక్‌లో వీడియోలు రాలేదని తెలిపింది. లాగిన్ కాలేకపోయామని కొందరి నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఈ విస్తృత సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం అన్ని సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు అంతరాయంపై ఫిర్యాదు చేయడంతో దానిని పునరుద్ధరించినట్లు యూట్యూబ్ వెల్లడించింది. ఈ సమస్యను అన్నిచోట్ల పరిష్కరించినట్లు తెలిపింది. సాంకేతిక సమస్యను పరిష్కరించేంత వరకు సహనం వహించిన వినియోగదారులకు ధన్యవాదాలు కూడా తెలిపింది. ఈ మేరకు టీమ్ యూట్యూబ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది.

కాగా, అవుటేజ్-ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ యూట్యూబ్‌పై 3,21,958 ఫిర్యాదులు వచ్చినట్లు సూచించింది. భారత్‌లో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో 20,000 ఫిర్యాదులు వచ్చినట్లు సూచించింది. ఇందులో ఎక్కువగా యూట్యూబ్ యాప్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుగా తెలిపింది.

 

  Last Updated: 18 Feb 2026, 11:12 AM IST