Site icon HashtagU Telugu

Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?

Young Men In US Carry Condoms To Funerals

Why Are They Taking Condoms To Funerals

కండోమ్ (Condoms).. దీన్ని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. హోటల్ కు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. లాడ్జికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. కానీ అమెరికాలో ప్రతి 8 మంది పురుషులలో ఒకరు అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు కూడా కండోమ్ తీసుకెళ్తున్నారట!! ఔను.. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న 2,000 మందిని సర్వే చేయగా ఈవిషయం వెల్లడైందని కండోమ్ కంపెనీ ట్రోజన్ వెల్లడించింది. ఇంతకీ అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు కండోమ్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా ? సర్వేలో పాల్గొన్న వాళ్ళే దీనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. అదేంటో చూడండి..”

ఎవరైనా చనిపోతే తీవ్ర దుఃఖం కలుగుతుంది. ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనసులో బాధ తప్ప ఇంకేం ఉండదు. ఇలాంటి టైంలోనూ బాధను సంతోషంగా మార్చే ‘హ్యాపీ హార్మోన్’ (ఎండార్ఫిన్‌) రిలీజ్ అయ్యేలా చేసే సామర్ధ్యం సెక్స్ కు మాత్రమే ఉంటుందని మేం నమ్ముతాం. అందుకే మేం అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడే కండోమ్ (Condoms) ను జేబులో వేసుకొని వెళ్తాం” అని సర్వేలో పాల్గొన్న చాలామంది అమెరికా యూత్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 8 మందిలో ఒకరు ఇదే ఆన్సర్ ఇవ్వడం గమనార్హం.

సర్వేలో వెల్లడైన విషయాలు ఇవీ:

Also Read:  Viral Stunt: ఫేమస్ అవడం కోసం కుక్కతో అలాంటి స్టంట్.. చివరికి?