Site icon HashtagU Telugu

Tamil Nadu:చనిపోయాక ఏం జరుగుతుంది…తెలుసుకోవడానికి ఓ యువకుడు సూసైడ్..!!

Suicide

Suicide

నేటిసమాజంలో యువత చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. కొంతమంది వింత కారణాలతో కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మరణించాక ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆత్మహత్య చేసుకున్నాడు.

మనం మరణించాక ఎక్కడికి వెళ్తాం…ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలసుకోవడం చాలామంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనిపై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. కొంతమంది మరణించాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ అనే యువకుడు మరణించాక ఎలా ఉంటుంది…ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రాణాలు తీసుకున్నాడు. లా రెండో సంవత్సరం చదువుతున్న సల్మాన్ హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరణించాక ఏం జరుగుతుందో తెలుుకోవాలనే ఇవిధంగా చేస్తున్నానంటూ…నేను దాచిన రూ. 50వేల మా అమ్మకు ఇవ్వండి అంటూ నోట్ రాశాడు. మానసికస్థితి బాగా లేకపోవడం వల్లే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version