Bandi Sanjay: అవును నేనే బిచ్చగాడ్ని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ కౌంటర్లు

  • Written By:
  • Updated On - May 9, 2024 / 11:39 PM IST

Bandi Sanjay: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు  మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. ‘‘నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. అవును బరాబర్ నేను బిచ్చగాడినే. నేను ఓట్లు అడుక్కుంటున్నా. వాళ్ళలాగా ఓట్లు కొనాలనుకుంటలేను’’ అని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కౌంట్ ఇచ్చారు బండి సంజయ్.

‘‘బండి సంజయ్ ఏం చేసిండని అడుగుతున్నారు. ₹12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. పోరాటాలు చేసిన. ప్రజల కోసం పనిచేసిన. కరోనా వచ్చినప్పుడు చావుకు తెగించి, కరోనా వార్డులోకి వెళ్లి రోగులకు భరోసా కల్పించిన. వైద్యులు, సిబ్బందికి అండగా నిలిచిన. ఇప్పుడున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్థానిక మంత్రి ఎక్కడికి పోయారు? మీ అందరి కోసం కొట్లాడింది నేను. ఓడినా, గెలిచినా వినోద్ రావుకు కరీంనగర్ గుర్తుకురాదు’’ అని అన్నాడు.

‘‘నా మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా నాడు రాలేదు. అతనిని మళ్లీ ఎలా గెలిపించారో మీకే తెలియాలి. గౌరవెల్లి బాధితుల కోసం అండగా నిలిచి, అర్ధరాత్రి వారికోసం వచ్చి పోరాటం చేశాను. మరి ఆ సమయంలో మంత్రి ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే వందల కోట్ల నుండి వేల కోట్లు సంపాదిస్తారు. నేను గెలిస్తే నాపై వేల కేసులు పెట్టినా భరించేందుకు సిద్ధంగా ఉన్నా’’ బండి సంజయ్ సవాల్ విసిరారు.