Site icon HashtagU Telugu

AP BRS: ప్రజా వ్యతిరేకతో వైసీపీ పతనం మొదలైంది: ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట

Political Bussiness

Thota

వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో నానాటికీ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న క్రమంలో వైకాపా పతనం మొదలైందని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం ఆళ్లగడ్డ కి చెందిన బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ వెస్లీ,తెనాలి కి చెందిన షేక్ భాష ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కి చెందిన పలువురు బి ఆర్ ఎస్ లో చేరారు . ఈ సంధర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టిడిపి,వైసీపీ ప్రభుత్వాల్లో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ఎస్సీ,ఎస్టీ ,బీసీ,మైనార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు పేరుకే పదవులు ఇచ్చారే కాని అధికారం ఇవ్వలేదని ద్వజమెత్తారు.

ఈ రెండు పార్టీలు వారి కులాలకు మాత్రమే పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయానికి తిలోదకాలిచ్చాయని మండిపడ్డారు. ఈ క్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్రంలో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా నిలిచిందని స్పష్టం చేశారు తమ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు . బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజానీకం కోరుకుంటోందన్నారు.

అందుకు ఇటీవల కాలంలో పెద్దఎత్తున తమ పార్టీలో జరుగుతున్న చేరికలే నిదర్శనంగా నిలుస్తాయయన్నారు. బి ఆర్ ఎస్ విస్తరణలో అన్నీ వర్గాల ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు .తొలుత అన్నపురెడ్డి ప్రదీప్,పట్ల సతీష్,మందముల మహీందర్, సామెయిల్, మాధిగ ఆనంద్ సహా పలు జిల్లాకి చెందిన నాయకులు కార్యకర్తలు తోట సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

Also Read: Nandamuri Balakrishna: ఎన్నికల వేళ.. బాలయ్య ‘పొలిటికల్’ ఫ్లేవర్ మిస్సింగ్