Rahul Gandhi: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా.. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం..

రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామరం మండలంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు..

Rahul Gandhi : రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని నిరసిస్తూ.. యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లాలో బొమ్మలరామరం మండలంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ ధర్నాలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని సంచలన వ్యాక్యలు చేశారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) గారిపై అనర్హత ప్రకటించిన మార్చి 23 చీకటి రోజని.. అతిపెద్ద ఈ ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిపై కుట్రలు తగదని ఆయన అన్నారు. మేమంతా రాహుల్ వెంటే ఉంటాంమని అవసరమైతే పదవులకు రాజీనామాకైనా సిద్ధంమని చెప్పారు. దేశం కోసం ఆయన తండ్రి, నాయనమ్మ ప్రాణాలు విడిచారని.. దేశం ఒక్క తాటిపై ఉండాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేశారని.. 3,500 కిలోమీటర్లు రాహుల్ నడిచారు.

ఎన్నికల ప్రచారంలో ఎప్పుడో అన్న ఒక మాట పట్టుకుని కుట్రలు చేయడం కరెక్ట్ కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.. కోర్టు తీర్పు వచ్చాక.. బెయిల్ ఇచ్చి 30 రోజుల సమయం ఇచ్చింది. కానీ, 24 గంటలు గడవకముందే అనర్హత వేటు ప్రకటించడం దుర్మార్గంమని అభిప్రాయ పడ్డారు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడాలి.. అంతేగానీ ఇలా కుట్రలు చేయడం తగదన్నారు.  ఈ అంశం పై పోరాటం సాగిస్తామని.. ప్రభుత్వ నిరంకుశ చర్యలపై వీధిపోరాటాలకైనా సిద్ధం అని అన్నారు.

కేంద్రం కుట్రలను తట్టుకుంటూ.. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్ మెంట్ కాంగ్రెస్ శ్రేణుల గుండెలకు హత్తుకుపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.. గాంధీ ఫ్యామిలీకి పదవులు లెక్కకాదు. ప్రధాన మంత్రి పదవి వాళ్లకు ముఖ్యం కాదు. అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాళ్లని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Also Read:  Congress :ఎన్నిక‌ల‌కు రాహుల్‌ గుడ్ బై?న్యాయ,శాస‌న స‌మ‌రం!