IPL 2023 Qualifier 2: ఆకాష్ మధ్వల్ డేంజరస్ డెలివరీ.. తప్పిన పెను ప్రమాదం

ఐపీఎల్ 2023 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది.

IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించారు. అయితే ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాష్ మధ్వల్ నాలుగో ఓవర్లో వేసిన బంతి చాలా ప్రమాదకరంగా మారింది. స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధిమాన్ సాహాకు తృటిలో ప్రమాదం తప్పింది.

ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి వృద్ధిమాన్ సాహా కాస్త తడబడ్డాడు. వేగంగా వచ్చిన బంతి నేరుగా సాహా తలకి బలంగా తాకింది. అయితే హెల్మెట్‌ ధరించడం ద్వారా పెను ప్రమాదం తప్పింది. దీంతో అత్యవసర సిబ్బంది హుటాహుటిన మైదానంలోకి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెకప్ తర్వాత సాహా ఫిట్‌గా ఉన్నారని, ఎలాంటి సమస్య లేదని ఫిజియో చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత వృద్ధిమాన్ సాహా తర్వాతి బంతికే ప్రతీకారం తీర్చుకుని బంతిని బౌండరీ తరలించాడు. ఈ మ్యాచ్‌లో సాహా 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్ లో వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు.

Read More: IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్