Site icon HashtagU Telugu

Wrestlers Protest: అమిత్ షాని కలిసిన రెజ్లర్లు… చార్జ్‌షీటు డిమాండ్

amit shah

amit shah

Wrestlers Protest: లైంగిక వేధింపులకు గురైన ఒలింపియన్ రెజ్లర్లు నెల రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే తాజాగా హోంమంత్రి అమిత్ షా రెజ్లర్లతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎదురుదాడికి దిగిన ఒలింపియన్ రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాను కలిశారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి షాను ఆయన నివాసంలో కలిసి బ్రిజ్ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిన్న రాత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత రెజ్లర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు, సుదీర్ఘ సమావేశంలో తమపై జరిగిన లైంగిక దాడుల విషయమై షాకు వారు వివరించారు. ఈ మేరకు బ్రిజ్ భూషణ్‌పై త్వరగా చార్జ్‌షీటు దాఖలు చేయాలని రెజ్లర్లు హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు, అయితే హోం మంత్రి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వినేష్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజుల పాటు నిరసన తెలిపారు.

Read More: Taliban: 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం.. తాలిబన్ల పనేనా!