World Cup 2023 Final: ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్‌కు వెంట వెంటనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ శుభ్‌మన్ గిల్ ను అవుట్ చేశాడు. 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి గిల్ ఔటయ్యాడు. ఆ తర్వాత 10 ఓవర్ లో మాక్స్ వెల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అయ్యర్ (4) కూడా వెంటనే ఔట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (24 నాటౌట్), రాహుల్ (1 నాటౌట్)గా ఉన్నారు.
రోహిత్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ పడింది. 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దింతో నరేంద్ర మోదీ స్టేడియంలో నిశ్శబ్ధం నెలకొంది. శ్రేయాస్ అయ్యర్ కూడా ఔట్ కావడంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయ్యర్‌ను పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అయ్యర్.
Also Read: World Cup 2023 Final: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 4 పరుగులకే గిల్ అవుట్..!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 1983, 2011 ఫైనల్స్‌లో కూడా టాస్ ఓడిన తర్వాతే టీమ్ ఇండియా విజయం సాధించింది.
We’re now on WhatsApp. Click to Join.