Site icon HashtagU Telugu

Bio Weapons On Trump : విషంతో ట్రంప్ కు లెటర్.. 55 ఏళ్ల మహిళకు 22 ఏళ్ల జైలుశిక్ష

Bio Weapons On Trump

Bio Weapons On Trump

Bio Weapons On Trump : ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని హెచ్చరిస్తూ  2020 సెప్టెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కు ఒక లేఖ వచ్చింది.  అది మామూలు లేఖ కాదు.. విషపూరిత లేఖ !! దానిలో రిసిన్ అనే ప్రాణాంతక విషం ఉంది. అయితే వైట్‌హౌస్‌కు డెలివరీ కావడానికి ముందే  ఆ ఎన్వలప్ ను ఆపేశారు..  అందులో విషం ఉందని గుర్తించారు.  ఆ లేఖలో “ట్రంప్ గారు నేను మీ కోసం కొత్త పేరును కనుగొన్నాను.. ది అగ్లీ టైరెంట్ క్లౌన్” అని రాసి ఉంది. లేఖపై ఉన్న వేలిముద్రల ఆధారంగా దాన్ని పంపినది 55 ఏళ్ల మహిళ  పాస్కేల్ ఫెరియర్ అని FBI గుర్తించింది. ఆ మహిళకు కెనడా, ఫ్రాన్స్ దేశాల పౌరసత్వాలు ఉన్నాయని  దర్యాప్తులో తేలింది. ఫెరియర్ యాక్టివిటీని ట్రాక్ చేసిన  FBI అధికారులు.. 2020 సెప్టెంబరులోనే  న్యూయార్క్‌లోని బఫెలోలో సరిహద్దును దాటుతుండగా అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also read : First 3D Building : దేశంలోనే తొలి 3D బిల్డింగ్ ప్రారంభం.. వీడియో చూడండి

అనంతరం ఆమెను దర్యాప్తు చేయగా.. ఆముదం బీన్స్ ప్రాసెసింగ్‌లో మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను ఉపయోగించి తన ఇంట్లోనే  రిసిన్‌ విషాన్ని తయారు చేశానని (Bio Weapons On Trump) ఒప్పుకుంది.  అమెరికా అధ్యక్షుడిపై బయో వెపన్స్ (జీవ ఆయుధాల)ను ప్రయోగించే యత్నం చేసిందనే అభియోగాలతో పాస్కేల్ ఫెరియర్ పై కేసులు నమోదు చేసి విచారణ జరిపారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ మహిళకు  22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రిసిన్‌ విషం శరీరంలోకి వెళితే 36 నుంచి 72 గంటలలోపు మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర అధికారులకు రిసిన్ విషంతో కూడిన లేఖలు పంపినందుకు మిస్సిస్సిప్పికి చెందిన ఒక వ్యక్తికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Also read : Kohli – 15 Years – 10 Things : కోహ్లీ 15 ఏళ్ల క్రికెట్ జర్నీ.. 10 ఆసక్తికర విశేషాలు