Jagtial: బస్ కండక్టర్ నిజాయితీ.. 8 లక్షలు విలువ చేసే బాగ్

ఓ మహిళ ప్రయాణికురాలు బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. దాని విలువ దాదాపు 8 లక్షలు. ఈ క్రమంలో టీఎస్‌ఆర్‌టీసీ మహిళా కండక్టర్ బ్యాగ్‌ని గమనించి తిరిగి ప్రయాణికురాలికి అప్పగించింది.

Jagtial: ఓ మహిళ ప్రయాణికురాలు బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. దాని విలువ దాదాపు 8 లక్షలు. ఈ క్రమంలో టీఎస్‌ఆర్‌టీసీ మహిళా కండక్టర్ బ్యాగ్‌ని గమనించి తిరిగి ప్రయాణికురాలికి అప్పగించింది. వివరాల ప్రకారం.. నిన్న రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్తున్న టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రయాణిస్తోంది . జగిత్యాల్ రాగానే బ్యాగ్‌ని బస్సులోనే వదిలేసి కిందకు దిగింది. బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును మహిళా కండక్టర్ గమనించారు. బ్యాగ్‌లోని ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికులకు సమాచారం అందించారు.

జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు నగలు ఉన్న బ్యాగును బాధిత ప్రయాణికురాలికి అందజేశారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, ఇది ప్రయాణికుల పట్ల తమ నిబద్ధత అని డిపో మేనేజర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాధితురాలు భవానీ మాట్లాడుతూ.. నగలు దొరక్కపోతే దసరా పండుగ కన్నీళ్లతో గడిచిపోయేదన్నారు. నిజాయితీగా బంగారు నగలు ఇచ్చిన కండక్టర్ వాణి, డ్రైవర్ తిరుపతికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Duplicates Votes: హైదరాబాద్‌లో భారీగా నకిలీ ఓట్లు