మహారాష్ట్ర పల్పఘర్ (Maharashtra’s Palghar) జిల్లా వాడా గ్రామీణ ఆసుపత్రిలో సదుపాయాల లేమి కారణంగా 25 ఏళ్ల గర్భిణీ అంబులెన్స్ (ambulance )లో ప్రసవం (deliver) చేసుకోవాల్సి వచ్చింది. కల్యాణి భోయే పురిటి నొప్పులతో డిసెంబర్ 13 న వాడా గ్రామీణ ఆసుపత్రికి వెళ్ళింది.
అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి చూసి.. ఆమెను 75 కిలోమీటర్ల దూరంలోని తానె సివిల్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆమెను అంబులెన్స్‌లో తరలిస్తుండగా… 10 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆమె అంబులెన్స్‌లోనే మగబిడ్డ జన్మనిచ్చింది. వెంటనే తల్లి మరియు బిడ్డను తిరిగి వాడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ యాదవ్ షేకరే, తల్లి మరియు బిడ్డ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటన గ్రామీణ వైద్య సదుపాయాల లోపాన్ని, అలాగే మెరుగైన రహదారుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తుంది.
Read Also : Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ