Site icon HashtagU Telugu

Hyderabad : మారేడ్‌పల్లి సీఐని స‌స్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్‌

rape

Rape

హైదరాబాద్: మారేడ్‌పల్లి సీఐ కె.నాగేశ్వరరావుపై వేటు ప‌డింది. వనస్థలిపురంలో కిడ్నాప్, అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శాఖ‌ప‌ర‌మైన విచార‌ణ‌కు ఆదేశించిన ఉన్న‌తాధికారులు ఆయ‌న్ని స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు, జూన్ 7న లాడ్జిలో ఇన్‌స్పెక్టర్ తనను నిర్బంధించాడని, బెదిరించి లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెను రక్షించేందుకు వచ్చిన భర్తపై కూడా తుపాకీతో దాడి చేసి బెదిరించాడని ఆరోపించింది.