Site icon HashtagU Telugu

Wife Complaint : భర్త ఆ టైపు అని తెలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన భార్య

wife complaint against husband

wife complaint against husband

ఏ అమ్మాయైనా పెళ్లి చేసుకున్నాక భర్త తో పడక సుఖాన్ని కోరుకుంటుంది. పిల్లల్ని కనాలని , సమాజంలో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటుంది. అలాగే కలలు కన్నా ఓ టెక్ యువతీ..పెళ్లి చేసుకున్నాక..ఎన్ని రోజులైనా భర్త పడక మీదకు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ఎందుకు ఈయన శృంగారం (Romance) కు దూరంగా ఉంటున్నాడని ఆలోచించడం మొదలుపెట్టింది. ఓ రోజు అతడి ఫోన్ చెక్ చేసి వాట్సాప్ , మెసెంజర్‌లను పరిశీలించగా.. భర్త అసలు కథ బయటపడింది.

భర్త స్వలింగ సంపర్కుడని (Homosexuality ) అని తెలిసి షాక్ అయ్యింది. దీనిపై అత్తమామలను నిలదీసింది. కొడుకు విషయం తెలిసిన ఎందుకు చెప్పలేదని..నా గొంతు ఎందుకు కోశారని..నిజం దాచి నన్ను ఎందుకు మోసం చేసారని నిలదీసింది. ఎందుకు ఇలా చేసావని భర్తను ప్రశ్నిస్తే అతడు..ఆమెపై దాడికి దిగాడు. దీంతో చేసేదేం లేక భర్త ఫై అలాగే అత్తమామల ఫై జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో (wife complaint against husband) పిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Andhra Pradesh : బాత్‌రూమ్‌లో ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి.. చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఘ‌ట‌న‌