ఫోన్‌లో మాట్లాడుతుంటే అమ్మాయిని! అనుమానంతో పై నుంచి కిందికి తోసేసిన తండ్రి

సెల్‌ఫోన్‌లో (Phone) కుమార్తె మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు.

Published By: HashtagU Telugu Desk
While talking on the phone, the father pushed the girl down with suspicion

Woan Ph

సెల్‌ఫోన్‌లో కుమార్తె మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి మందలించాడు. దీంతో ఆమె డాబాపైకి ఎక్కి తిరిగి ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి ఆమె ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించాడు. వెంటనే కుమార్తె గొంతుపట్టుకుని పైనుంచి కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Also Read:  Ostriches as vehicles in China: చైనాలో వాహనాలుగా ఆస్ట్రిచ్ లు!

  Last Updated: 11 Feb 2023, 12:43 PM IST