Two Accounts One Device : ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు

Two Accounts One Device : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. త్వరలో ఒకే ఫోన్ లో 2 వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ప్రస్తుతం  వాట్సాప్  బిజినెస్ వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు.. 

Published By: HashtagU Telugu Desk
Two Accounts One Device

Two Accounts One Device

Two Accounts One Device : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.. 

త్వరలో ఒకే ఫోన్ లో 2 వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను యాడ్ చేసుకోవచ్చు. 

ఈ ఫీచర్ ను ప్రస్తుతం  వాట్సాప్  బిజినెస్ వెర్షన్‌లో టెస్ట్ చేస్తున్నారు.. 

ఆండ్రాయిడ్ (Android) బీటా వెర్షన్ 2.23.13.5లో ఈ కొత్త ఫీచర్ ను వాట్సాప్ పరీక్షిస్తోంది. మొదటిసారి వాట్సాప్ యాప్ లో  అదనపు అకౌంట్ ను మీరు  సెటప్ చేసినప్పుడు.. మీ మొదటి వాట్సాప్  అకౌంట్ నుంచి లాగ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో రెండో వాట్సాప్ అకౌంట్ సమాచారం కూడా మీ డివైజ్‌లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా మీకు కావాల్సిన వాట్సాప్ అకౌంట్‌కు ఈజీగా సింగిల్ క్లిక్ తో మారొచ్చు. ఈమేరకు WABetaInfo ఒక రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. విభిన్న అకౌంట్లలోని  వ్యక్తిగత చాటింగ్స్, వర్క్ సంబంధిత చాట్‌లు, ఇతర టాస్క్‌లను నిర్వహించాల్సిన వారికి ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Also read : WhatsApp Call Back Alert : వాట్సాప్ వెబ్ లో “కాల్ బ్యాక్” ఫీచర్

రెండో వాట్సాప్ అకౌంట్ కోసం  ఇంకో ఫోన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు.  రెండు వేర్వేరు ఫోన్ నంబర్లతో రిజిస్టర్ చేసుకున్న.. రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను(Two Accounts One Device) ఒకే ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అయితే ఒకే ఫోన్ ద్వారా ఒకటికి మించి ఎన్ని వాట్సాప్ అకౌంట్స్ లోకి లాగిన్ అయ్యే ఛాన్స్ ఇస్తారనే దానిపై ఇంకా  క్లారిటీ లేదు. ఐఓఎస్ (iOS), (Android) యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది కూడా తెలియరాలేదు.  ఈ ఫీచర్ డ్యూయల్  SIM స్లాట్‌లు ఉన్న ఫోన్‌లకు మాత్రమే పరిమితం చేస్తారా ? eSIM మోడల్‌ ఫోన్లకు  కూడా అనుకూలంగా ఉంటుందా ? అనేది ఖచ్చితంగా తెలియదు.

  Last Updated: 16 Jun 2023, 03:19 PM IST