CM Mamata Banerjee: హెలికాప్టర్ లో జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ

సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. హెలికాప్టర్ లో తన సీఎం సీటులో కూర్చునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. దీంతో స్వల్పంగా గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.

Published By: HashtagU Telugu Desk
CM Mamata Banerjee

CM Mamata Banerjee

CM Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. హెలికాప్టర్ లో తన సీఎం సీటులో కూర్చునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. దీంతో స్వల్పంగా గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.

We’re now on WhatsAppClick to Join

సీఎం మమతా బెనర్జీ ఈరోజు వెస్ట్ బర్ధమాన్‌లోని దుర్గాపూర్‌లో హెలికాప్టర్‌లో ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ఎక్కిన అనంతరం సీఎం సీటులో కూర్చునే సమయంలో జారి పడిపోయారు. అయితే సెక్యూర్టీ సిబ్బంది ఆమెను వెంట‌నే పైకి లేపారు.

స్వల్ప ప్రమాదం జరిగినప్పటికీ ఆమె ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొనేందుకు అస‌న్‌సోల్ బ‌య‌లుదేరి వెళ్లారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత నెలలో కూడా గాయపడ్డారు. గత నెల మార్చ్ 14న మమత బెనర్జీ ఇంట్లో వ్యాయమం చేస్తుండగా కిందపడిపోవడంతో ఆమె నుదిటున బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు.

Also Read; Actor Missing : టీవీ నటుడి కిడ్నాప్.. ఐదు రోజులుగా మిస్సింగ్‌.. ఏమైంది ?

  Last Updated: 27 Apr 2024, 02:50 PM IST